Phone Tapping Case | బండి సంజయ్ సంచలనం: “నన్నే మొదట ట్యాప్ చేశారు”

హైదరాబాద్, 8 ఆగస్టు 2025 — రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తాజాగా సిట్ విచారణ (SIT Investigation) కు హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలపై గతంలోనే కేసు నమోదవగా, ఇప్పుడు దానిపై మరింత స్పష్టత వస్తోంది.

🔥 Big Billion Days Sale 🔥

Laptops at Lowest Prices – Hurry, Limited Time!

Shop Now

సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్

బండి సంజయ్ ఈ రోజు దిల్‌కుషా గెస్ట్ హౌస్ కు విచారణ కోసం హాజరయ్యారు. విచారణకు ముందు ఖైరతాబాద్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, తన అనుచరులతో కలిసి ర్యాలీగా విచారణ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ – “ఈ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని నేనే. నా ఫోన్ కాల్స్ ను అత్యధికంగా ట్యాప్ చేశారు” అని అన్నారు.

BRS – కాంగ్రెస్ మధ్య దోస్తీ ఆరోపణ

బండి సంజయ్ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. “రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అధికారులు స్వేచ్ఛ లేరు, నిజంగా విచారణ చేస్తే రాజకీయంగా బీఆర్ఎస్ కు నష్టం వస్తుంది” అని అన్నారు. తన వద్ద ఉన్న అంతరంగిక సమాచారంను మొత్తం సిట్ అధికారులకు అప్పగిస్తానన్నారు.

CBI విచారణకే బీజేపీ డిమాండ్

ఫోన్ ట్యాపింగ్ కేసును **సీబీఐ (CBI)**కి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. “సిట్ పై మాకు నమ్మకం లేదు. ఇది టైమ్ పాస్‌ వ్యవహారం మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌ను కాపాడుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవాలు వెలికితీయాలంటే కేంద్ర స్థాయిలో విచారణ అవసరమని స్పష్టం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో టార్గెట్

పాత ఆధారాల ప్రకారం, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేయడం స్పష్టమైంది. వివాదాల సమయంలో న్యాయవాదులతో మాట్లాడిన సంభాషణలు సైతం ట్యాప్ అయ్యాయన్న వివరాలు అధికారుల చేతిలో ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ఆయన సిట్‌ ముందు ఉంచనున్నట్టు తెలిపారు.

Join WhatsApp Group Join WhatsApp
Scroll to Top