భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) మరోసారి విద్యార్థులకు శుభవార్త అందించింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2025 పేరుతో పేద మరియు వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ ఉపకార వేతనాలు భారత్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తాయి.
ఎవరు అర్హులు?
- పేద కుటుంబాల నుంచి ఉన్నత చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులు.
- ఎంపికైన కోర్సు మొత్తం కాలానికి ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది.
- ఇంటర్న్‌షిప్ లేదా స్టైఫెండ్ పీరియడ్‌లో ఉన్నవారికి అర్హత ఉండదు.
ఎంత మొత్తం అందిస్తారు?
- వైద్య విద్య (MBBS, BAMS, BHMS, BDS): సంవత్సరానికి ₹40,000 (రెండు విడతల్లో ₹20,000 చొప్పున).
- ఇంజినీరింగ్ (BE, B.Tech, B.Arch): సంవత్సరానికి ₹30,000 (రెండు విడతల్లో ₹15,000 చొప్పున).
- డిగ్రీ, ఇంటిగ్రేటెడ్, డిప్లమా, ITI, వొకేషనల్ కోర్సులు: సంవత్సరానికి ₹20,000 (రెండు విడతల్లో ₹10,000 చొప్పున).
- బాలికల కోసం ప్రత్యేక స్కాలర్షిప్: 10వ తరగతి తర్వాత ఇంటర్, డిప్లమా, వొకేషనల్ కోర్సులకు సంవత్సరానికి ₹15,000 (రెండు విడతల్లో ₹7,500 చొప్పున).
రిజిస్ట్రేషన్ & డాక్యుమెంట్స్
- చివరి తేదీ: అక్టోబర్ 6, 2025.
- అవసరమైన పత్రాలు: బ్యాంక్ ఖాతా వివరాలు, IFSC కోడ్, రద్దు చేసిన చెక్ జిరాక్స్, లబ్ధిదారుడి పేరు.
- స్కాలర్షిప్ మొత్తాన్ని NEFT ద్వారా నేరుగా విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారు.
ముఖ్య సూచనలు
- ప్రతి సంవత్సరం నిర్దేశిత అర్హతలు సాధిస్తేనే స్కాలర్షిప్ renewal అవుతుంది.
- అర్హత సాధించకపోతే ఉపకార వేతనం రద్దవుతుంది.
- సాధారణ స్కాలర్‌షిప్‌లతో పాటు Special Girl Child Scholarships కూడా ఉన్నాయి.


