ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త – రూ.1.25 కోట్ల ప్రమాద బీమా ప్రతిపాదన


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌ కొత్త భరోసా కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగుల కుటుంబాల భద్రత కోసం భారీ మొత్తంలో Accident Insurance మరియు Health Insurance పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

🔥 Big Billion Days Sale 🔥

Laptops at Lowest Prices – Hurry, Limited Time!

Shop Now

ప్రమాద బీమా: రూ.1.25 కోట్లు నుండి రూ.1.50 కోట్లు వరకు

సింగరేణి సంస్థ, విద్యుత్ ఉద్యోగుల కోసం అమల్లో ఉన్న పథకాలను ఆదర్శంగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకూ మరింత మెరుగైన బీమా అందించడానికి ప్రయత్నిస్తోంది.

🔹 ప్రతిపాదన ప్రకారం, ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబానికి రూ.1.25 కోట్ల నుండి రూ.1.50 కోట్ల వరకు బీమా అందేలా చర్చలు జరుగుతున్నాయి.
🔹 ఇప్పటికే కొన్ని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.

సెంట్రల్ ఎంప్లాయీస్‌ కంటే మెరుగ్గా

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బీఐ ద్వారా రూ.1 కోటి ప్రమాద బీమా అందుబాటులో ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మరింత ఎక్కువ మొత్తంలో బీమా అందించాలని నిర్ణయించడం విశేషం.

ఆరోగ్య బీమా సైతం మెరుగ్గా

ప్రస్తుతం అమల్లో ఉన్న Employee Health Scheme (EHS) పై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా, రూ.30 లక్షల వరకు Health Insurance అందించాలన్న ప్రతిపాదనపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

👉 ఈ పథకం కింద ఉద్యోగులు రూ.2,495 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. త్వరలో దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఉద్యోగుల కుటుంబాలకు భరోసా

సర్కార్‌ ప్రణాళికల ప్రకారం, ప్రమాదం లేదా అనారోగ్య సమయంలో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.

Join WhatsApp Group Join WhatsApp
Scroll to Top