బాల ఆధార్ కార్డు | ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరి? ఇలా దరఖాస్తు చేయండి

దేశంలోని ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరి అయినట్టే, ఇప్పుడు చిన్నారులకు కూడా బాల ఆధార్ (Baal Aadhaar / Blue Aadhaar Card) అవసరం అవుతోంది. ఐదేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా జారీ చేసే ఈ ఆధార్ కార్డును బ్లూ ఆధార్ అని పిలుస్తారు.


బాల ఆధార్ కార్డు ప్రత్యేకతలు

ఈ కార్డు పుట్టిన తేదీ, పేరు, ఫోటో వివరాలతో జారీ అవుతుంది.

ఐదేళ్లలోపు పిల్లలకు బయోమెట్రిక్స్ (వేలిముద్రలు, కంటి స్కానింగ్) అవసరం ఉండదు.

తల్లిదండ్రుల్లో ఒకరి మొబైల్ నంబర్ ఈ కార్డుతో లింక్ చేయాలి.

5 ఏళ్ల తర్వాత పిల్లల బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయడం తప్పనిసరి.


అవసరమైన పత్రాలు

బాల ఆధార్ కోసం తల్లిదండ్రులు సమర్పించాల్సిన డాక్యుమెంట్స్:

చిన్నారి జనన సర్టిఫికేట్ లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ సర్టిఫికేట్

తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు

ప్రస్తుత చిరునామా రుజువు (ఆధార్‌తో సరిపోలాలి)



ఆన్‌లైన్ దరఖాస్తు విధానం (UIDAI ద్వారా)

1. UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in సందర్శించాలి.


2. “My Aadhaar” → “Book an Appointment” ఎంపిక చేయాలి.


3. నగరం ఎంచుకుని మొబైల్ నంబర్‌తో OTP వెరిఫై చేయాలి.


4. సమీప ఆధార్ కేంద్రం కోసం తేదీ, సమయం బుక్ చేయాలి.


5. అపాయింట్మెంట్ రోజున తల్లిదండ్రుల్లో ఒకరు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇవ్వాలి.


6. చిన్నారి పుట్టిన తేదీ, ఫోటో, పత్రాలు సమర్పించాలి.


7. దరఖాస్తు పూర్తయ్యాక బాల ఆధార్ పోస్టులో వస్తుంది.

ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం

సమీప ఆధార్ నమోదు కేంద్రంకి వెళ్లాలి.

అప్లికేషన్ ఫారం నింపి, అవసరమైన పత్రాలు జతచేయాలి.

తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్, బయోమెట్రిక్ ఇవ్వాలి.

Acknowledgement Slip తీసుకుని, అందులోని Enrolment ID ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు.

60–90 రోజుల్లో కార్డు పోస్టు ద్వారా అందుతుంది.

ఎందుకు తప్పనిసరి?

ప్రస్తుతానికి స్కూల్ అడ్మిషన్, స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్య పథకాలు, ప్రభుత్వ సబ్సిడీలు పొందడానికి బాల ఆధార్ తప్పనిసరి అవుతోంది. అందుకే ప్రతి తల్లి తండ్రి వీలైనంత త్వరగా ఈ కార్డు కోసం దరఖాస్తు చేయడం మంచిది.

👉 ముఖ్యం: బాల ఆధార్ ఐదేళ్ల వరకు మాత్రమే చెల్లుతుంది. ఐదేళ్లు నిండిన వెంటనే బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి.

🔥 Big Billion Days Sale 🔥

Laptops at Lowest Prices – Hurry, Limited Time!

Shop Now
Join WhatsApp Group Join WhatsApp
Scroll to Top