రైతులకు శుభవార్త: అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

వానాకాలం పంట దిగుబడికి ఏర్పాట్లు

వానాకాలం (Kharif) సీజన్‌లో రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన సన్నరకాల బోనస్ కారణంగా రైతులు దాదాపు 60% సన్నరకం వరినే సాగు చేశారు. అధికారులు ఈ సీజన్‌లో కోటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

🔥 Big Billion Days Sale 🔥

Laptops at Lowest Prices – Hurry, Limited Time!

Shop Now

అక్టోబర్ 1 నుంచి సేకరణ

ప్రస్తుతం పంట ఈనిక దశలో ఉంది. ముందుగా సాగు చేసిన జిల్లాల్లో 15 రోజుల్లో కోత ప్రారంభం కానుంది. భారత ఆహార సంస్థ (FCI) మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి పాడి కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే ముందుగానే సేకరణ కేంద్రాలు తెరుచుకునే అవకాశముంది.

8 వేల కొనుగోలు కేంద్రాలు సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో ముందుగా పంట వచ్చేందున బాన్సువాడ, బోధన్, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఈ నెలాఖరుకే కేంద్రాలు సిద్ధం కానున్నాయి. ఈ విషయంపై చర్చించడానికి ఎఫ్‌సీఐ అధికారులు వచ్చే వారం హైదరాబాద్‌కి రానున్నారు.

మద్దతు ధర & బోనస్ వివరాలు

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర:

  • ఏ గ్రేడ్ ధాన్యం – రూ.2,389/క్వింటాల్
  • బీ గ్రేడ్ ధాన్యం – రూ.2,369/క్వింటాల్

అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాల రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. గత వానాకాలం సీజన్‌కి సంబంధించిన బోనస్ రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. అయితే యాసంగి సీజన్‌కు మాత్రం ఇంకా బోనస్ ఇవ్వలేదు. ఈ సారి కూడా అదే విధంగా బోనస్ అందిస్తారా అన్నదానిపై రైతుల్లో ఆసక్తి నెలకొంది.

రైతులు ధాన్యం విక్రయానికి వెళ్లే ముందు సమీప కొనుగోలు కేంద్రం వివరాలు తెలుసుకోవడం మంచిది. తాజా అప్డేట్స్ కోసం అధికారిక Telangana Govt Update వెబ్‌సైట్లను పరిశీలించండి.

Join WhatsApp Group Join WhatsApp
Scroll to Top